నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల ఎదురుగా ఎర్పాటు చేసిన మద్యం దుకాణంను ఎత్తివేయాలని కాలేజీ ప్రిన్సిపాల్ మరియు విధ్యార్థులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో ప్రైవేటు డిగ్రీ కళాశాల ఎదురుగా మద్యం దుకాణాన్ని నుతనంగా ఏర్పాటు చేశారు. గృహ సముదాయాలు, విద్య సంస్థల సమీపంలో వైన్ షాపు ఎర్పాటు చేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. వైన్ షాపు ఎదురుగా స్థానికులు డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలకు విధ్యార్థులు, విధ్యార్థినిలు వారి తల్లిదండ్రులు వస్తుంటారని దేవాలయం లాంటి విధ్యా సంస్థ ఎదురుగా అధికారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలు విధ్యార్థులు తిరిగే చోట మద్యం బాబులు మద్యం సేవిస్తూ రోడ్లు పై ఉంటే తివ్ర అంటాకం ఎర్పడుతుందన్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యా సంస్థలకు ఎదురుగా వైన్ షాప్..
99
previous post