మునిరత్నం నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న – నారా లోకేశ్

Nara Lokesh

Advertisements

&NewLine;<p>వైసీపీ నేతల్లో అసహనం పెరిగిపోతోందని&comma; ఓటమి భయంతో వారు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు&period; తాజాగా చంద్రగిరి మండలం భీమవరంలో మునిరత్నం నాయుడుపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు&period; మునిరత్నం నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు&period; మునిరత్నం నాయుడు కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని నారా లోకేశ్ భరోసానిచ్చారు&period; వైసీపీ ఫ్యాక్షన్ పాలన సాగిస్తోందని&comma; రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు&period; ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మునిరత్నం నాయుడుపై దాడి ఘటనను ఖండించారు&period; టీడీపీ నేత మునిరత్నం నాయుడుపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు&period; మద్యం&comma; గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు దాడికి దిగారని అచ్చెన్నాయుడు ఆరోపించారు&period; సీఎం గాల్లో తిరుగుతూ శాంతిభద్రతలను గాలికి వదిలేశారని విమర్శించారు&period; ఎన్ని దాడులు చేసినా టీడీపీ వెనుకడుగు వేయదన్న విషయం గుర్తించాలని స్పష్టం చేశారు&period; మునిరత్నం నాయుడుపై దాడి చేసిన వైసీపీ నేతలపై ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; మునిరత్నం కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.