81
ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్సిపి తోనే ఉంటాను. ఇంట్లో తండ్రిని కొడుకు ఏ విధంగా అడుగుతాడో అదే హక్కుతో నేను మాట్లాడాను. వాటిని ఈ ఎల్లో మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేసారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, తండ్రి లాంటి మంత్రి పెద్దిరెడ్డి రామాచంద్రరెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, నన్ను గెలిపించిన పూతలపట్టు నియోజకవర్గ ప్రజలే కారణం. నేను ప్రెస్ మీట్ లో మాట్లాడినవి ఎవరిని ఉద్దేశించి కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్సిపి పార్టీ కోసమే కష్ట పడతాను, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం జగన్ మోహన్ రెడ్డి గార్ల మేలు మరువను.