96
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లో దారుణం చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో భోగి పండుగ సందర్భంగా గ్రామంలోని యూత్ ఆధ్వర్యంలో మహిళలకు కోలాటం పోటీలు నిర్వహించారు. కాగా ఈ కోలాటం పోటీలలో మహిళలు కోలాట నృత్యం చేశారు. కాగా కోలాటం మధ్యలో అంతడుపుల రాజమణి (40) హఠాత్తుగా కుప్పకూలిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు, గ్రామ పెద్దలు జమ్మికుంట లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించిందని తెలిపారని గ్రామ సర్పంచ్ దాసరి భద్రయ్య తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తో కల్వల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.