మసీదుల్లోకి మహిళలు…. హైకోర్టు తాజా తీర్పు

women should be allowed to enter mosques

Advertisements

&NewLine;<p>మహిళలను మసీదుల్లోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు తాజాగా పేర్కొంది&period; మసీదు&comma; జాషన్స్&comma; ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది&period; షియా ముస్లిం మహిళలను మసీదు&comma; ఇతర పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు అనుమతించట్లేదంటూ అక్బరీ సొసైటీ కార్యదర్శి ఆస్మా ఫాతిమా హైకోర్టును ఆశ్రయించారు&period; పిటిషన్‌పై హైకోర్టు జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు&period; ఇబ్దత్‌కానాకు చెందిన ముత్తవల్లీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను ప్రార్థనా మందిరాలకు అనుమతించడంలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు&period; ఈ విషయంలో వక్ఫ్ బోర్డుకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఉపయోగం లేకపోయిందని చెప్పారు&period; మరోవైపు&comma; ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది పేర్కొన్నారు&period; అయితే&comma; మహిళలపై వివక్ష ప్రదర్శించడం తగదని&comma; రాజ్యాంగం వారికి సమానత్వ హక్కులు కల్పించిందని హైకోర్టు స్పష్టం చేసింది&period; ఈ క్రమంలో షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ ముత్తవల్లీ కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్