నాజూగ్గామారేందుకు…బరువెక్కకుండా ఆహారపు అలవాట్లు

become slimmer

Advertisements

&NewLine;<p>కొన్ని రకాల పదార్థాలు మానేసి… మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే&period; అయితే దాంతోపాటూ చేసుకోవాల్సిన మార్పులూ మరికొన్ని ఉన్నాయి&period; పొద్దున టిఫిన్‌&comma; రెండుపూటల భోజనం… ఇంతేగా అనుకుంటే చాలదు&period; కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి&period; దీనివల్ల తక్కువ కెలొరీలు అందుతాయి&period; శరీరం ఇన్సులిన్‌ని తక్కువగా విడుదల చేస్తుంది&period; రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉంటాయి&period; అదే ఆకలిని తగ్గిస్తుంది&period; ఫలితంగా బరువూ అదుపులో ఉంటుంది&period; కప్పు నిండా ఐస్‌క్రీం&comma; పైన నాలుగైదు రకాల పండ్ల ముక్కలతో తినే అలవాటు తగ్గించుకోండి&period; బదులుగా కప్పునిండా పండ్లముక్కలు తీసుకుని దానిపైన చెంచా ఐస్‌క్రీం వేసుకోండి&period; సలాడ్‌పై చాలా కొద్దిగా చీజ్‌ వేసుకోవడం లాంటివన్నీ కెలొరీలు తగ్గించే ప్రత్యామ్నాయాలే&period; పొద్దుటిపూట తిఫిన్‌ తిన్నాక ఓ గ్లాసు బత్తాయీ&comma; కమలాఫలం రసం తాగండి&period; వాటివల్ల తక్కువ కెలొరీలు అందుతాయి&period; పొట్ట నిండినట్లుగా ఉంటుంది&period; దాంతో అదేపనిగా ఎక్కువగా తినడం జరగదు&period; ఆకలితో సంబంధం లేకుండా&comma; మీ ముందు ఎంత ఎక్కువ ఆహారం ఉంటే అంత ఎక్కువగా తినేస్తారని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి&period; దీన్ని అధిగమించాలంటే చిన్న పళ్లెం తీసుకొని&comma; కొద్దిగానే వడ్డించుకోవాలి&period; దానివల్ల తెలియకుండానే తక్కువగా తీసుకుంటాం&period; కాఫీ&comma; టీలు తాగే గ్లాసులకీ ఇదే సూత్రం వర్తిస్తుంది&period; ఎంత బిజీగా ఉన్నా సరే&comma; అన్నం ఒక్కటే కాదు&comma; టిఫిన్‌&comma; స్నాక్స్‌ ఏవయినా సరే… భోజనాల బల్ల దగ్గరే తినాలనే నియమాన్ని పెట్టుకోండి&period; ఫలితంగా టీవీ&comma; కంప్యూటరు ముందు కూర్చుని తినే అలవాటు తప్పుతుంది&period; నోరూరించే పదార్థాలు ఎన్ని చేసుకున్నా సరే… పచ్చి కూరగాయ ముక్కలు కూడా మీ ముందు ఉండేలా చూసుకోవాలి&period; ముందు వాటిని తిన్నాకే ఇతర పదార్థాలను తినాలనే నియమాన్ని పెట్టుకోవాలి&period; దానివల్ల పొట్ట నిండినట్లుగా ఉంటుంది&period; కెలొరీలూ తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు