వ్యవసాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.

Advertisements

<p>రాష్ట్రంలో అకాల వర్షం కురిసిన విషయం తెలిసిందే&period; అయితే పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు&period; రాష్ట్రవ్యాప్తంగా 1&comma;215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు&comma; మరో 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు సీఎంకి అధికారులు వివరించారు&period; ఆరు జిల్లాల్లోని 16 మండలాలు&comma; 89 గ్రామాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడిందని&comma; క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు&period; ప్రధానంగా కృష్ణా&comma; ఎన్టీఆర్&comma; నెల్లూరు&comma; పార్వతీపురం మన్యం&comma; అనంతపురం&comma; శ్రీసత్యసాయి జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు&period; పంటల వారీగా చూస్తే 630 హెక్టార్లలో మొక్కజొన్న&comma; 384 హెక్టార్లలో వరి&comma; మరో 200 హెక్టార్లలో మినుము వంటి పంటలు నీటి పాలయ్యాయని తెలిపారు&period; అటు అరటి&comma; మామిడి వంటి ఉద్యాన పంటలకు కూడా భారీగా నష్టం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు&period; రైతులకు న్యాయం జరిగేలా&comma; ప్రతి ఎకరా నష్టాన్ని ఖచ్చితంగా లెక్కించాలని అధికారులకు సీఎం ఆదేశించారు&period; అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు&period; నష్టపరిహారం చెల్లింపులో పారదర్శకత పాటిస్తామని చెప్పారు&period; క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.