12 అవుట్ ఆఫ్ 17….

congress flag

Advertisements

&NewLine;<p>తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డి… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు&period; బాధ్యతలను చేపట్టిన నెల రోజుల కాలంలోనే పాలనపై ఆయన తనదైన స్పష్టమైన ముద్రను వేయగలిగారు&period; పార్టీలోని సీనియర్లందరికీ తగు గౌరవం ఇస్తూ… పార్టీలో అంతర్గతంగా ఎలాంటి అసంతృప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు&period; ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు&period; ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు&period; రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కనీసం 12 స్థానాలను కైవసం చేసుకునే దిశగా రేవంత్&comma; పార్టీ సీనియర్లు టార్గెట్ నిర్దేశించుకున్నారు&period; ఆదిలాబాద్&comma; నిజామాబాద్&comma; మహబూబ్ నగర్&comma; హైదరాబాద్ నేతలతో రేవంత్ సమావేశమయ్యారు&period; పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించారు&period; లోక్ సభ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు&period; ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు చేపట్టనున్నట్టు చెప్పారు&period; ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభను నిర్వహించనున్నట్టు ఆ జిల్లా నేతలకు చెప్పారు&period; ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్