173
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. గెలుపే లక్ష్యంగా చేసుకుని పార్టీ కోసం త్యాగాలు చేయటానికైనా ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని అధినేత జగన్ మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. దీనిలో భాగంగానే నిన్న 11 మంది అభ్యర్థులకు స్థాన చలనం మొదలైంది. ఉత్తరాంధ్ర పై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. అభ్యర్థుల మార్పు పై కసరత్తు మొదలుపెట్టింది. అరకు, పాడేరు,అనకాపల్లి, పాయకరావు పేట, ఇచ్చాపురం,చోడవరం ,
పాతపట్నం, ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాలు లో కొత్త ముఖాలకు చోటిస్తారని తెలుస్తోంది. అరకు , అనకాపల్లి ఎంపీలను అసెంబ్లీ స్థానాలకు, మంత్రి అమర్నాథ్ ను అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిస్తారని వినిపిస్తుంది.