70
బాపట్ల జిల్లాలో 12వ రోజు అంగన్వాడీలు నిరసన చేశారు. బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో బస్సులు, కార్లు తుడుస్తూ భిక్షాటన చేశారు. కార్లు, బస్సులు తుడిచి భిక్షాటన చేసిన డబ్బులను సీఎం జగన్ కి పంపిస్తామని అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే వాటితోనైనా అంగన్వాడీల జీతాలు పెంచాలని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇటీవల కాలంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ మాట్లాడిన మాటలు కూడా తమకు ఎంతో బాధ కలిగించాయని వారన్నారు. ఒక స్త్రీ అయి ఉండి కూడా సాటి స్త్రీల పట్ల ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరమన్నారు.