గత 28 రోజుల నుంచి గన్నవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఆపకపోతే ఎస్మా అమలు చేస్తామని జారీ చేసిన మేము చేస్తున్న సమ్మె మా డిమాండ్స్ నెరవేర వరకు ఆపేది లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంగన్వాడీలు చేస్తున్న 28 రోజుల సమ్మెకు 28వ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య నీటిపారుదల శాఖ అధ్యక్షులు
ఆళ్ల వెంకట గోపాలకృష్ణ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ మూర్ఖత్వ ప్రభుత్వము రాష్ట్రంలో అనేకమైన సమస్యలను పరిష్కరించలేక చేతులెత్తేసింది. అంగన్వాడి వర్కర్స్ గ్రామ గ్రామాలలో నిజాయితీగా సర్వీసులు చేస్తూ వారి జీవనోపాధికి వేతనం 26000 అడుగుతుంటే ఇవ్వలేమని బొత్స సత్యనారాయణ అంటున్నారు. స్కిల్డ్ లేబర్ కి రోజుకి 1000 రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ అటెండర్ కి నెలకు లక్ష రూపాయలు వేతనం వస్తుంది. కేవలం వీరి జీవన ఉపాధికి 26000 వేతనం అడిగినందుకు వీరిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించటం అనేది చాలా దారుణమని అన్నారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, అంతిమ విజయం అంగన్వాడీలదే ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 4200 ఉన్న వేతనాన్ని 10500 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత అంగన్వాడీలకు అది చేస్తాం ఇది చేస్తాం అని హామీలు ఇచ్చి నాలుగున్నర సంవత్సరాలలో కేవలం 1000 రూపాయలు మాత్రమే వేతనం పెంచాడని అన్నారు. అంగన్వాడీలు అడిగే గ్రాడ్యూటీ గాని రిటైర్మెంట్ బెనిఫిట్ గాని ఉద్యోగ భద్రత న్యాయపరమైనవి, ఎంతోమంది పిల్లలకు అనేక సర్వీసులు చేసి వాళ్ళ జీవితాన్ని మొత్తం ఉద్యోగాలకే పరిమితం చేసి ఏ ఆధారం లేకుండా ఉండటం చాలా బాధాకరని అన్నారు.
అంతిమ విజయం అంగన్వాడీలదే…. ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదు
75
previous post