గత 28 రోజుల నుంచి గన్నవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఆపకపోతే ఎస్మా అమలు చేస్తామని జారీ చేసిన మేము చేస్తున్న సమ్మె మా డిమాండ్స్ నెరవేర వరకు ఆపేది లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంగన్వాడీలు చేస్తున్న 28 రోజుల సమ్మెకు 28వ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య నీటిపారుదల శాఖ అధ్యక్షులు
ఆళ్ల వెంకట గోపాలకృష్ణ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ మూర్ఖత్వ ప్రభుత్వము రాష్ట్రంలో అనేకమైన సమస్యలను పరిష్కరించలేక చేతులెత్తేసింది. అంగన్వాడి వర్కర్స్ గ్రామ గ్రామాలలో నిజాయితీగా సర్వీసులు చేస్తూ వారి జీవనోపాధికి వేతనం 26000 అడుగుతుంటే ఇవ్వలేమని బొత్స సత్యనారాయణ అంటున్నారు. స్కిల్డ్ లేబర్ కి రోజుకి 1000 రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ అటెండర్ కి నెలకు లక్ష రూపాయలు వేతనం వస్తుంది. కేవలం వీరి జీవన ఉపాధికి 26000 వేతనం అడిగినందుకు వీరిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించటం అనేది చాలా దారుణమని అన్నారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, అంతిమ విజయం అంగన్వాడీలదే ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 4200 ఉన్న వేతనాన్ని 10500 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత అంగన్వాడీలకు అది చేస్తాం ఇది చేస్తాం అని హామీలు ఇచ్చి నాలుగున్నర సంవత్సరాలలో కేవలం 1000 రూపాయలు మాత్రమే వేతనం పెంచాడని అన్నారు. అంగన్వాడీలు అడిగే గ్రాడ్యూటీ గాని రిటైర్మెంట్ బెనిఫిట్ గాని ఉద్యోగ భద్రత న్యాయపరమైనవి, ఎంతోమంది పిల్లలకు అనేక సర్వీసులు చేసి వాళ్ళ జీవితాన్ని మొత్తం ఉద్యోగాలకే పరిమితం చేసి ఏ ఆధారం లేకుండా ఉండటం చాలా బాధాకరని అన్నారు.
Esma
ఏపీ రాష్ర్ట వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు మిన్నంటాయి. పలు చోట్ల అంగన్వాడీలు తమ నిరసనలను ఉదృతం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోనూ.. అంగన్వాడి కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఒంటికాలతో నిలబడి నిరసనలు చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఇప్పటికైనా వైయస్ జగన్ తమ సమస్యలను తెలుసుకొని తాము పడుతున్న బాధలను, కష్టాలను గమనించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Also..
సీఎం జగన్మోహన్ రెడ్డి నీ ఎస్మా చట్టానికి ఇక్కడ ఎవరూ భయపడరని బొబ్బిలిలో ఎన్టీఆర్ బొమ్మ సెంటర్లో ఎస్మా జీవో నెంబర్ -2 కాపీలను అంగన్వాడీలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకరరావు మాట్లాడుతూ మీ బెదిరింపులకు ఎవరు భయపడరని ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసే వరకు సమ్మె కొనసాగుతుందని… అధికారంలోకి రావడం కోసం మీరు చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే ఉలుకెందుకు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం పట్ల అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనం అమలు చెయ్యాలని, తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే…తమను అత్యవసర సేవల్లోకి తీసుకొస్తూ జీవో ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. తమిళనాడు ఉద్యోగుల పై ఎస్మా ప్రయోగిస్తే ఎం జరిగిందో…రాబోయే రోజుల్లో వైసీపీకి కూడా అదే పరిస్థితి వస్తుందని సీఐటీయూ నాయకులు ఎద్దేవా చేశారు.