78
మన నాడీ వ్యవస్థ ఎంత రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఒత్తిడి తగ్గించేందుకు రోజూవారీ జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవాలి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- ప్రతిరోజూ కొంత సమయం పాటు లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయడం వల్ల ట్రిగ్గర్‌లను తగ్గించి, నాడీ వ్యవస్థకు విశ్రాంతిని పొందవచ్చు. యోగా, వ్యాయామం చేయడం వలన ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడొచ్చు.
- విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం అడ్రినల్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది.
- ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవచ్చు. సరైన ఆహారం తింటే శారీరకంగా, మానసికంగానూ శక్తిని పెంచుతుంది.
- సానుకూల ఆలోచనా దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం వంటి ప్రాథమిక అలవాట్ల ద్వారా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.