విశాఖ కేంద్ర కారాగారంలో కోడికత్తి కేసులో నిందితుడుగా ఉన్న జనపల్లి శ్రీనివాస్ తో గురువారం( నేటి ) మధ్యాహ్నం దళిత సంఘాల నాయకులతో కలసి వి ద సం అధ్యక్షుడు బూసి వెంకటరమణ జైల్లో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయటకు వచ్చి ఫ్ల కార్డులతో నినాదాలు చేసారు. ఈ సంధర్భంగా బూసి వెంకటరమణ మట్లాడుతూ నిందితుడు శ్రీనివాస్ ఉదయం నుంచి దీక్షలో ఉన్నాడని జైలు అధికారులు ఈ సాయంత్రానికి గాని అనుమతి ఇవ్వలేమని చెప్పారని అన్నారు. అయినా శ్రీనివాస్ దీక్ష ప్రారంభించారన్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ఇవ్వాల్సిన బాధ్యత జైలు అధికారులకు ఉందని, కోడి కత్తి కేసులో బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. కోడి కత్తి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్.ఐ.ఏ స్పష్టం చేసినా ఎందుకు జగన్ కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. శ్రీనివాస్ ను జైల్లో మగ్గేలా చేసి బయటకు రానివ్వకుండా కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ బయటకు వస్తే జగన్ కు ఎన్నికల ముందు చిక్కులు తప్పవనే ఆపుతున్నారని, ఎస్సీలపై కోర్టులో ఉన్న 19 కేసులను ఇటీవల ఎత్తివేశారని శ్రీనివాస్ విషయంలో ఎందుకు ఉదారత చూపించలేకపోతున్నారని అన్నారు. దళితుల పట్ల కపటి ప్రేమ చుపిస్తున్నావని జగన్ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న జగన్…
70
previous post