భువనగిరి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటీవల మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ క్రిష్ణయ్యలపై 31 మంది అవిశ్వాస తీర్మానం కోరారు. అయితే ఆర్డీవో అమరేందర్ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్ జరుపగా అనుకూలంగా 31మంది కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్తో సహా మొత్తం 36 మంది ఉండగా.. 31 మంది ఆమోదం తెలిపినట్లు ఆర్డీవో అమరేందర్ పేర్కొన్నారు. అయితే ఆమోదం తెలిపిన 31 మంది కౌన్సిలర్లలో 16 మంది టిఆర్ఎస్ తొమ్మిది మంది కాంగ్రెస్ ఆరు మంది బిజెపి కౌన్సిలర్లు ఉన్నారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్ తో సహా మిగతా ఐదుగురు మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు ఆబోతుల కిరణ్ కుమార్, చెన్న స్వాతి మహేష్, ఏనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య అవిశ్వాస ప్రక్రియకు గైర్హాజరయ్యారు. అయితే ఆమోదం తెలిపిన నివేదికను జిల్లా కలెక్టర్కు పంపిస్తున్నామని తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆర్డిఓ అమరేందర్ మీడియా ముందు వెల్లడించారు.
గెలిచిన అవిశ్వాస తీర్మానం…
83
previous post