ఈ రోజు మందమర్రి ఏరియా సింగరేణి MVTC వృత్తి శిక్షణ కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించరు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా మందమర్రి ఏరియా GM ఏ మనోహర్ విచ్చేసి, ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. రక్తదానం చెయ్యడం అనేది ప్రాణదానంతో సమానం అని అన్నారు. ఈ శిబిరంలో గనుల, డిపార్ట్మెంట్ల కార్మికులు, అప్రెంటీస్ కార్మికుల తో రక్తదాన శిబిరం నిర్వహించామని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారు రక్త నిల్వలు తగ్గాయన్న సూచన మేరకు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు మరియు మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేదలకు, గర్భిణీ స్త్రీలకు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు, అత్యవసర ఆపరేషన్లకు ఉచితంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారు అందజేస్తారని ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ని అభినందించారు. సింగరేణి సంస్థ ఉత్పత్తితో పాటు ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు చేపడుతూ రక్తదాన శిబిరాలు చేపడుతూ తలసేమియా వ్యాధి గ్రస్తులను ఆదుకుంటున్నమని అన్నారు. మందమరి MVTVC యాజమాన్యము రక్తదాన శిబిరాలు ఏర్పాటు ఇప్పటివరకు 37 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు మొత్తంగా 77 మంది రక్తదానం చేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సలేంద్ర సత్యనారాయణ (ఏఐటియుసి వైస్ ప్రెసిడెంట్ ), ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, సిఎంఓఏఐ ప్రెసిడెంట్ రమేష్, ఎంవిటిసి మేనేజర్ శంకర్, ట్రైనింగ్ ఆఫీసర్ అశోక్ కుమార్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్, MVTC అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.