రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని తన కార్యాలయంలో రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకుల పనితీరు ,నిర్వహణ, బలోపేతం ,అన్ని జిల్లా కేంద్రాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన పనితీరును కలిగిన 14 బ్లడ్ బ్యాంకులను Components Upgrade చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.సమీక్షలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బ్లడ్ బ్యాంకుల పనితీరు, నిర్వాహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూన్ 14 న జరిగే ప్రపంచ రక్త దాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో రక్తదాన ఆవశ్యకతపై అవగాహన సదస్సులను నిర్వహించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను కోరారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్త నిల్వలను పెంచుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా చోoగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ R V కర్ణన్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ హైమావతి, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, ఐపీఎమ్ డైరెక్టర్ డాక్టర్ శివ లీల, మెడికల్ అండ్ హెల్త్ అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్ లు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పీఎఫ్ క్లెయిమ్లు ఇక మరింత సులభతరం.దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 194140