గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ఇవాళ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 22 వరకు అన్ని నియోజక వర్గాల పరిధుల్లోనూ వాలంటీర్లకు పురస్కారాలు అందజేయనున్నారు. 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవావజ్ర పురస్కారాలు అందిస్తారు. బ్యాడ్జ్, మెడల్, 45,000 రూపాయల నగదు ఇస్తారు. 4,150 మందికి సేవారత్న పురస్కారాలు అందిస్తారు. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు ఇప్పటివరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని పెంచింది. సేవా వజ్ర పురస్కారం మొత్తం గతంలో రూ.30 వేలు ఉండగా నేటి నుంచి రూ.45 వేలు అందుతాయి. సేవా రత్నకు రూ.20 వేల పురస్కారం ఉండగా నేటి నుంచి రూ.30 వేలకు పెరుగుతుంది. సేవా మిత్ర పురస్కారానికి అందించే రూ.10 వేలను రూ.15 వేలకు పెంచారు. ఏపీలో మొత్తం 2,55,464 మందికి రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నారు. ఏడు రోజులపాటు పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఉంటుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.