సింగరేణి (Singareni):
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనుల పై దేశవ్యాప్తంగా జరిగే సమ్మె అంతగా ప్రభావితం చూపలేదు. కేంద్రంలో బిజెపి సర్కారు అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలతో విసుగెత్తిన కార్మిక సంఘాలు గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ప్రచారంలో కనిపించిన ఊపు ఈరోజు జరిగే సమ్మెలో మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
రామగుండం ఏరియాలో ఉన్న భూగర్భ బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులపై కార్మికులు యధావిధిగా ఉదయం షిఫ్ట్ లకు వెళ్లడం కనిపించింది. కాగా కొన్ని బొగ్గు గనులపై మాత్రం కార్మిక నేతల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అయితే స్థానికంగా ఉన్న కార్మిక సంఘాల మధ్య ఐక్యత లేదని తెలుస్తుంది. ప్రధానంగా సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్యం పొందిన కార్మిక సంఘాలు సమ్మెకు ఓవైపు పిలుపునిచ్చాయే గానీ… విజయవంతానికి మాత్రం సహకరించడం లేదంటూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.