Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh వాలంటీర్లకు పురస్కారాల చెక్కు అందించిన జగన్

వాలంటీర్లకు పురస్కారాల చెక్కు అందించిన జగన్

by Satya
CM Jagan

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిర్వహించిన సభలో వాలంటీర్లకు పురస్కారాల చెక్కు అందించారు సీఎం జగన్. 2.60 లక్షల మంది వాలంటీర్లు నా సైన్యం. పేదవాడికి సేవ చేసేందుకు.. భవిష్యత్తును మార్చేందుకు యుద్ధానికి మీరు సిద్ధమా అని వాలంటీర్లకు సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. 58 నెలలు నాతోపాటు మీరు ప్రజలకు సేవలు అందించారు. ఇంకో రెండు నెలలు సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్తు మార్చేందుకు పనిచేయాలి అని కోరారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో జరిగిన గ్రామ, వార్డు వాలంటీర్ల సేవా పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలనలో సంస్కరణలను ప్రజలకు చేరవేసే యువ సైన్యమే వాలంటీర్ల వ్యవస్థ అని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని 17 వేల నిరుపేద కూలీల కుటుంబాలకు ఇప్పుడు ఇస్తున్న రూ.2500ను పెంచి మార్చి నుంచి రూ.5వేలు చెల్లిస్తామని ప్రకటించారు.

Read Also..

Follow us on : FacebookInstagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
    అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్‌ విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
  • వైభవంగా గోదావరి పుష్కరాలు.
    గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: