కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుకునేందుకే పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలలో వివేక్ కుమారుడు పోటీ చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి (BRS) కొప్పుల ఈశ్వర్ (Koppula eswar) ధ్వజమెత్తారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్ మాట్లాడారు. దేశంలోనే అత్యంత సంపన్నులైన కుటుంబానికి చెందిన వివేక్ తమ ఆస్తులను పెంచుకునేందుకే పార్లమెంటు ఎన్నికలలో కుమారుడిని బరిలో దించుతున్నారని ఆరోపించారు. వివేక్ తండ్రి వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదని, అదేవిధంగా వివేక్ సైతం పలు పార్టీలు మారి ఆస్తులు కూడ పెట్టుకున్నారని అన్నారు. తన కుమారుడిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి కుటుంబ రాజకీయాలకు తెరలేపారని తెలిపారు. ఇప్పటికే వివేక్ తన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారని అన్నారు. స్థానికుడు అయిన తనను ఆదరించాలని ప్రజలకు విన్నవించారు. సింగరేణి కార్మికుడిగా తనకు ఈ ప్రాంత సమస్యలపై అవగాహన ఉందని, వివేక్ కుమారుడు గెలిస్తే ఈ ప్రాంతానికి రాడని విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఇష్టకామేశ్వరి అమ్మవారి టికెట్ కౌంటర్ వద్ద భక్తులు ఆందోళన..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి