పరుషవాక్కు

A word of mouth

Advertisements

&NewLine;<p>విస్పష్టమైన భావవ్యక్తీకరణకు భగవంతుడు మానవులకు ప్రసాదించిన అమోఘమైన వరమే వాక్కు&period; ఈ వాగ్భూషణం మానవులను మహనీయులుగా తీర్చిదిద్దగలుగుతుంది&period; పశుపక్ష్యాదులకు లేని సౌకర్యం మానవులకు లభించినందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనవలసినదే&period; అంతే తప్ప ఏ దశలోనూ వాక్కును దుర్వినియోగం చేయరాదు&period; ప్రియమైన వాక్కుతో సాధ్యమైనంతగా అందరినీ సంతోషింపచేయాలి&period; అంతే కాని ఎదుటివారిని నొప్పించే పద్ధతిలో పరుషమైన వాక్కులను పలుకవద్దు అని ఆర్యాశతకకర్తయైన సుందరపాండ్యుడు లోకానికి హితప్రబోధం చేశాడు&period; యుద్ధాలలో మనుషలను ఆయుధాలు గాయపరుస్తూ ఉంటాయి&period; విషం మానవుల ప్రాణాల ను హరిస్తుంది&period; నిప్పు నిలువునా మనిషిని కాల్చివేస్తుంది&period; పాపకర్మలు మనిషిని అప్పుడప్పు డూ ఆయా సందర్భాలనుబట్టి పీడిస్తూ ఉంటాయి&period; కాని ఇవేవీ బాధించని రీతిలో హృదయానికి కుచ్చుకున్న ముల్లులా మనుషలను ప్రతి క్షణం పట్టి పీడించేవి పరుషంగా పలికే పలుకులే న తథా రిపుః న శస్త్రం నాగ్నిః న విషం న దారుణో వ్యాధిః పరితాపయతి చ పురుషం యథా కటుకభాషిణీ వాణీ ॥అని సుందరపాండ్యుని ఆర్యోక్తి&period; కఠినంగా&comma; పరుషంగా మాట్లాడేవారికి ఆప్తులు&comma; ఆత్మీయులు దూరమౌతారు&period; సన్మార్గంలో పయనించేవారు అట్లే అన్యమార్గంలో పయనించేవారు అనే భేదం లేకుండా స్త్రీలు-పురుషులు చిన్నలు-పెద్దలు అనే తేడా లేకుండా అన్ని కాలాలకు అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తులందరికీ మనోవేదనను కలిగించేవి పరుషవాక్కులే అనే సత్యాన్ని గుర్తిద్దాం&period; పుల్లవిరుపు మాటలతో&comma; వ్యంగ్యోక్తులతో&comma; అధిక్షేపాలతో&comma; నిష్ఠరమైన వాక్కులతో హృదయానికి గాయాన్ని కలిగించే విధానానికి స్వ్తిచెప్పే ప్రయత్నాన్ని చేద్దాం&period; పాముకాటుతో&comma; విషప్రయోగంతో&comma; అగ్నిప్రమాదంతో ఒకేసారి ప్రాణాలు పోతాయి&period; ఈ విషాదాన్ని మించినరీతిలో పరుషవాక్కులచేత గాయపడినవారు అటు ప్రాణాలు పోక&comma; ఇటు ప్రశాంతంగా ఉండలేక ప్రతిక్షణం సతమతమవుతూ విలవిలలాడుతూ ఉంటారు&period; ఇటువంటి బాధ మనవల్ల మరొకరికి కలగడం సరికాదనే సత్యాన్ని గుర్తిద్దాం&period; ఆచరించే ప్రయత్నం కూడా చేద్దాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..