Srisailam Reservoir :
శ్రీశైలం జలాశయాన్ని జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం చైర్మన్ త్రిపాఠి నేత్రత్వంలో కెఆర్ఎంబి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. డ్యామ్ అధికారులతో భద్రత నీటి నిల్వలు నీటి వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం జలాశయానికి 2009 వచ్చిన వరదలకు ఎక్కడెక్కడ డ్యామేజ్ లు జరిగాయని వాటివల్ల జలాశయానికి ఏమాత్రం ప్రమాదం ఉందనే కోనంలో ఆరా తీశారు. శ్రీశైలం జలాశయానికి 2009 లో వచ్చిన వరదల వివరాలకు చెందిన రికార్డులను తెప్పించాలని డ్యామ్ అధికారులను అడుగా వారి వద్ద రికార్డు అందుబాటులో లేకపోయే సరికి కొంతసేపు చైర్మన్ త్రిపాఠి ఆచ్చర్యానికి గురయ్యారు. శ్రీశైలం డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లు, రోప్ లు, యాప్రాన్, ప్లంజ్ పూల్ ను అనువున క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం జలాశయంలోని గ్యాలరీ అండర్ గ్రౌండ్ వాటర్ వివరాలు, లీకేజీలను పరిశీలించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణులు బృందం చైర్మన్ త్రీపాఠి అధికారులతో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయానికి 2009 లో వచ్చిన వరదలకు ఎంత వాటర్ వచ్చింది. జలాశయం నుంచి ఎన్ని వేల క్యూసెక్కుల వరదనీరు గేట్ల ద్వారా విడుదల చేశారు. గేట్ల ద్వారా వరదనీరు విడుదల చేస్తున్న సమయంలో ముందు భాగంలో ప్లంజ్ పూల్ కు ఏర్పాడిన భారీ గోయ్యికి చెందిన సర్వేలు నిర్వహించారా అంటూ ఆరా తీశారు. సర్వేల రిపోర్టులు డ్యామ్ అధికారుల దగ్గర ఉన్నాయా లేవాని చైర్మన్ త్రిపాఠి కొచ్చన్ చేశారు వరదల సమయంలో వచ్చిన వాటర్ లెక్కలను రికార్డులను తెప్పించుకుని పరిశీలించారు. డ్యామ్ ఎగువ భాగమున నీటిలోని అడుగు భాగంలో పూడిక ఏ మాత్రం చేరిందని అధికారుల సర్వే రిపోర్టులను అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం జలాశయంలోని నిటి నిల్వలు నీటివాటలపై రేపు డ్యామ్ వ్యూపాయింట్ నందు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం కెఆర్ఎంబి అధికారులు పరిశీలన సాయంత్రం వరకు కొనసాగనుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.