రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు లాంటి ఎన్ని పథకాలు తెచ్చిన చంద్రబాబు (Chandra babu)ను ప్రజలు ఎవరు నమ్మరని బుట్టా రేణుక (Butta Renuka) అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుట్టా రేణుక గడప గడప కు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నారు. అనంతరం బుట్టా రేణుక మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు మేనిఫెస్టోలో ఉన్న ఈ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తాను పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీలు నెరవేర్చారన్నారు. మాట తప్పే చంద్రబాబును నమ్మి ప్రజలు ఓటు వేసే పరిస్థితిలో లేరని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే జగన్ వెనుకే ప్రజలు ఉన్నారని మరోసారి జగన్ కు ప్రజలు పట్టం కట్టబోతున్నారని బుట్టా రేణుక తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కొత్తపల్లి సుబ్బారాయుడు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి