71
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో… దీనికి తోడు శనివారం కావటంతో రాష్ర్ట నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావటంతో వేకువజాము నుండి ఆలయం కిక్కిరిసిపోయింది. క్యూలైన్లు నిండి వెలుపల వరకు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. వందలాది వాహనాలతో ఘాటు రోడ్డు, ఆలయ పరిసరాలు నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు వన్ వే ఏర్పాటు చేశారు.