నంద్యాల జిల్లా శ్రీశైలంలోని చండీశ్వర సధన్ వద్ద భారీ కొండచిలువ అర్ధరాత్రి హల్ చల్ చేసింది. కొంతసేపు అటూఇటూ తిరుగుతూ భక్తులను గందరగోళానికి గురి చేసింది. కొండచిలువను చూసిన భక్తులు, స్దానికులు భయాందోళనకు గురయ్యారు. చండీశ్వర సధన్ లో దేవస్థానం ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. అయితే అర్ధరాత్రి భారీ కొండచిలువ ఒక్కసారిగా ప్రత్యక్షమవడంతో ఉద్యోగులు కొండచిలువను చూసి ఉలిక్కిపడ్డారు. చండీశ్వర సధన్ చుట్టుప్రక్కల భక్తుల వసతీ గదుల సత్రాలు ఉండటంతో కొండచిలువను గమనించిన భక్తులు స్దానికులకు సమాచారం అందించారు. విషయం ఆనోటా ఈనోట పడగానే కొండచిలువను చూసేందుకు చుట్టుప్రక్కల వాళ్లు గుంపులుగా తరలివచ్చారు. జనారణ్యంలోకి కొండచిలువ రావడంతో చుటుపక్కల వారు స్నేక్ క్యాచర్ రాజాకు సమాచారం ఇచ్చారు. అర్థరాత్రి కొండచిలువ ఉండే ప్రదేశానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ రాజా చాకచక్యంగా కొండచిలువని పట్టుకుని దగ్గరలోని అడవి ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీనితో చండీశ్వర సధన్ లోని ఉద్యోగులు స్దానికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. Read Also
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.