రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల ఆందోళన కార్యక్రమం 13 వ రోజుకు చేరుకుంది, స్థానిక గన్నవరంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుండి సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ ప్రదర్శిస్తూ రహదారిపై బైఠాయించి రహదారి దిగ్బంధం చేసి నిరసన తెలియజేసి అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ మాట్లాడుతూ అంగన్వాడీల జీతాల పెంపు గ్రాడివిటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి 13 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసి అడుగుతున్న సమాధానం లేదని అన్నారు. బొత్స సత్యనారాయణ మూడు రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తాము అని హామీ ఇచ్చారు. హామీలు ఇవ్వడం కాదు మాకు కావలసింది ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి మాకు న్యాయం చేయాలి. మేము రోడ్డుపై ఇబ్బందిపడి నిరసన చేస్తుంటే కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా దేశం మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇది సభమేనా అంగన్వాడిలను రోడ్డున పడేసి పట్టించుకోకుండా దిక్కులేని స్థితిలో మమ్మల్ని చేసింది ఈ జగన్ ప్రభుత్వమే కదా అని వారు ప్రశ్నించారు. మేము న్యాయమైన కోరికలే కదా అడిగేది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమి అడగట్లేదు కదా ఎందుకని మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని వారు ఈ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ పథకాలు ఏమైనా పెట్టుకుందామా అంటే ఆన్లైన్లో మేము గవర్నమెంట్ ఎంప్లాయిస్ గా చూపించబడుతున్నాము దాని వలన మేము ఏ పథకానికి అప్లై చెయ్యలేకపోతున్నాము. మా జీవితాలు మొత్తం ఈ అంగన్వాడి ఉద్యోగానికి అంకితం చేసి కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ ఉద్యోగ భద్రత లేకుండా మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వారు బాధపడ్డారు. వెంటనే ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించే విధంగా కనీస వేతనం 26000 చేసి, ఉద్యోగ భద్రత కల్పించి, వేతనంతో కూడిన సెలవులు ఇప్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
మమ్మల్ని దిక్కులేని స్థితిలో పడేసింది ఈ ప్రభుత్వమే కదా….
78
previous post