ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు 26 రోజులుగా సమ్మెలు నిర్వహిస్తున్న రాష్ట్రం తమ సమస్యలు పరిష్కరించకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటో కు పసుపు, కుంకుమ ,చీర, గాజులను ఇచ్చి నిరసన తెలిపారు. దీక్ష శిబిరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ను పెట్టీ మండలం లోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పసుపు, కుంకుమ, చీర, గాజులను ఇచ్చి వినూత్నంగా నిరసన తెలియజేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి
సీఎం జగన్మోహన్ రెడ్డి నీ ఎస్మా చట్టానికి ఇక్కడ ఎవరూ భయపడరని బొబ్బిలిలో ఎన్టీఆర్ బొమ్మ సెంటర్లో ఎస్మా జీవో నెంబర్ -2 కాపీలను అంగన్వాడీలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకరరావు మాట్లాడుతూ మీ బెదిరింపులకు ఎవరు భయపడరని ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసే వరకు సమ్మె కొనసాగుతుందని… అధికారంలోకి రావడం కోసం మీరు చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే ఉలుకెందుకు అన్నారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం లో సామాజిక సాధికార బస్సు యాత్రలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం మోపిదేవి వెంకటరమణ మీడియా తో మాట్లాడుతూ సామాజిక సాధికార యాత్ర కొత్త అధ్యాయానికి నాంది పలికిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ది అని ఆయన అన్నారు. కొన్ని సామాజిక వర్గాల వారికి సమన్వయ న్యాయం జరుగుతుందని దానికి సామాజిక సాధికార బస్సు యాత్ర నిదర్శనమని, జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన అభివృద్ధిని ఈ సామాజిక సాధికార యాత్ర ద్వారా స్వాగతిస్తున్నారని, ప్రతి పేదవాడు తన కాళ్ళ మీద తాను నిలబడాలని, రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్ మోహన్ రెడ్డి కి ప్రజలు పట్టం కడతారని ఆయన అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం ద్వారా ప్రతి లబ్ది దారుడు లబ్ది పొందారని, రేపు 2024 ఎలక్షన్స్ లో తిరిగి రెండో పర్యాయం జగన్ సీఎం అయితేనే అణగారిన వర్గాలకు, అనాగరిక వర్గాల వారికి న్యాయం జరుగుతుందని మోపిదేవి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మాట్లాడుతూ కొంత మంది పెట్ ఆర్టిస్టులు చెప్పే మాటలు నమ్మవద్దని 27 ఎస్సీ పధకాలు ఏమి రద్దు కాలేదని అందులో రాజోలు నియోజకవర్గంలో 939 మందికి లబ్ధి చేకురుందని, ప్రతి సంవత్సరం చేయూత ఆసరా పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు 18750/- రూపాయలు లబ్ది పొందారని, నిజమైన పేదవాడికి లబ్ది చేకూరాలని, అది జగన్ మోహన్ రెడ్డి ద్వారా సాధ్యమని, కొంత మంది ఆర్టిస్టులు ఎన్ని అబద్ధాలు చెప్పిన అవి చెల్లవని ఎమ్మెల్యే రాపాక అన్నారు. మోపిదేవి, విశ్వరూప్ మాట్లాడుతున్నటు వంటి సభా ప్రాంగణం నుండి సభ జరుగుతున్న మధ్యలో మహిళలు లెగిసి వెళ్లిపోవడంతో సభా ప్రాంగణం అంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల ఆందోళన కార్యక్రమం 13 వ రోజుకు చేరుకుంది, స్థానిక గన్నవరంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుండి సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ ప్రదర్శిస్తూ రహదారిపై బైఠాయించి రహదారి దిగ్బంధం చేసి నిరసన తెలియజేసి అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ మాట్లాడుతూ అంగన్వాడీల జీతాల పెంపు గ్రాడివిటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి 13 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసి అడుగుతున్న సమాధానం లేదని అన్నారు. బొత్స సత్యనారాయణ మూడు రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తాము అని హామీ ఇచ్చారు. హామీలు ఇవ్వడం కాదు మాకు కావలసింది ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి మాకు న్యాయం చేయాలి. మేము రోడ్డుపై ఇబ్బందిపడి నిరసన చేస్తుంటే కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా దేశం మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇది సభమేనా అంగన్వాడిలను రోడ్డున పడేసి పట్టించుకోకుండా దిక్కులేని స్థితిలో మమ్మల్ని చేసింది ఈ జగన్ ప్రభుత్వమే కదా అని వారు ప్రశ్నించారు. మేము న్యాయమైన కోరికలే కదా అడిగేది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమి అడగట్లేదు కదా ఎందుకని మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని వారు ఈ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ పథకాలు ఏమైనా పెట్టుకుందామా అంటే ఆన్లైన్లో మేము గవర్నమెంట్ ఎంప్లాయిస్ గా చూపించబడుతున్నాము దాని వలన మేము ఏ పథకానికి అప్లై చెయ్యలేకపోతున్నాము. మా జీవితాలు మొత్తం ఈ అంగన్వాడి ఉద్యోగానికి అంకితం చేసి కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ ఉద్యోగ భద్రత లేకుండా మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వారు బాధపడ్డారు. వెంటనే ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించే విధంగా కనీస వేతనం 26000 చేసి, ఉద్యోగ భద్రత కల్పించి, వేతనంతో కూడిన సెలవులు ఇప్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నన్నయ్య వర్సిటీలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఉభయగొదావరి జిల్లాల వైసీపీ యువజన అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ లు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ముందడగు వేస్తున్నామని ఎమ్మెల్యే రాజా వెల్లడించారు. 4 వేలకు పైగా కంపెనీలలో యువతకు ఉద్యోగా అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే రాజా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీలు అయిన మార్పులు, చేర్పులు, రాజకీయ సమీకరణాలు చేస్తారని ఆయన అన్నారు. అలాగే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ కూడా సీట్ల వ్యవహారం లో మార్పులు చేస్తున్నారని అన్నారు. 175 స్థానాల్లో 175 ఎమ్మెల్యే లను ఎన్నుకునేందుకు ప్రజలు మరోసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరింత జాగ్రత్తగా గెలుపు గుర్రాలను పెట్టాలని, అక్కడక్కడా చిన్న చిన్న సర్దుబాటులు చేసి పార్టీని, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా మాకు మెస్సేజ్ ఇస్తూ మార్పులు చేస్తున్నారని అన్నారు . రాజానగరం లో మళ్ళీ వైసీపీ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యల కోసం నేను సీఎం కార్యాలయానికి వారానికి రెండు సార్లు వెళ్లానని, అభివృద్ధి చూసి ఎమ్ చేయలో తెలియక, ఎమ్మెల్యే మేము అంటూ కొంతమంది అసలు పెంచుకుంటున్నారని ఆ ఆశలు ఆడియాసలు అయ్యే సమయం దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు. ఈరోజు రాష్ట్రంలో మొదటి స్థానంలో మొట్టమొదట గెలిచే స్థానం ఏదైనా ఉంది అంటే అది రాజానగరం మాత్రమే అని ఆశ పడుతున్న కొందరికి చెబుతున్నా అని సీట్ల గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను, ఆపైనే ఉండే వాటికోసమే నేను ఆలోచిస్తానని ఆయన అన్నారు.





Total views : 78210