బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 22వ రోజు అంగన్వాడీలు రోడ్డుపై దున్నపోతు కు మెమోరాండం ఇచ్చి వినూత్న నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని అంగన్వాడీలు హోరెత్తించారు. దున్నపోతు మేము ఇచ్చిన మెమోరాండమ్ స్వీకరించి మాపై కృప చూపిందని, ఈ గుడ్డి ప్రభుత్వం 22 రోజులుగా అంగన్వాడీ అక్కచెల్లెళ్లు ఇల్లు వాకిళ్లు వదిలి రోడ్డుపై కూర్చొని ధర్నాలు చేస్తుంటే దున్నపోతుపై వర్షం కురిసినట్లుగా ఉందని ఇకనైనా మా డిమాండ్లు నెరవేరుస్తారని ఆశిస్తున్నామని వారు అన్నారు. లక్ష అరు వేల పై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 22 రోజుల నుండి మేము సమ్మెలు దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల పట్ల దయ చూపి డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
ICDS Project
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల ఆందోళన కార్యక్రమం 13 వ రోజుకు చేరుకుంది, స్థానిక గన్నవరంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుండి సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ ప్రదర్శిస్తూ రహదారిపై బైఠాయించి రహదారి దిగ్బంధం చేసి నిరసన తెలియజేసి అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ మాట్లాడుతూ అంగన్వాడీల జీతాల పెంపు గ్రాడివిటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి 13 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేసి అడుగుతున్న సమాధానం లేదని అన్నారు. బొత్స సత్యనారాయణ మూడు రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తాము అని హామీ ఇచ్చారు. హామీలు ఇవ్వడం కాదు మాకు కావలసింది ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి మాకు న్యాయం చేయాలి. మేము రోడ్డుపై ఇబ్బందిపడి నిరసన చేస్తుంటే కనీసం మమ్మల్ని పట్టించుకోకుండా దేశం మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇది సభమేనా అంగన్వాడిలను రోడ్డున పడేసి పట్టించుకోకుండా దిక్కులేని స్థితిలో మమ్మల్ని చేసింది ఈ జగన్ ప్రభుత్వమే కదా అని వారు ప్రశ్నించారు. మేము న్యాయమైన కోరికలే కదా అడిగేది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమి అడగట్లేదు కదా ఎందుకని మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని వారు ఈ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ పథకాలు ఏమైనా పెట్టుకుందామా అంటే ఆన్లైన్లో మేము గవర్నమెంట్ ఎంప్లాయిస్ గా చూపించబడుతున్నాము దాని వలన మేము ఏ పథకానికి అప్లై చెయ్యలేకపోతున్నాము. మా జీవితాలు మొత్తం ఈ అంగన్వాడి ఉద్యోగానికి అంకితం చేసి కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ ఉద్యోగ భద్రత లేకుండా మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వారు బాధపడ్డారు. వెంటనే ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించే విధంగా కనీస వేతనం 26000 చేసి, ఉద్యోగ భద్రత కల్పించి, వేతనంతో కూడిన సెలవులు ఇప్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.





Total views : 78250