తెలుగుదేశంపార్టీ ఆదేశాలతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం ఇంద్ర పాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారయణ మూర్తి కళ్యాణ మండపంలో టి.డి.పి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజి మంత్రి పితాని సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ బిసి సాధికార శెట్టి బలిజ విభాగం కుడిపుడి సత్తిబాబు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి లాల్ పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్, చంద్రబాబు కల్పించారన్నారు. వైసిపి పాలనలో బీసీలు వెనకబడి పోయారని, బీసీ సంక్షేమానికి ఆనాడు చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు, వివిధ కార్పొరేషన్ ల ద్వారా చేయూత అందించారని, నేడు రాష్ట్ర ప్రభుత్వం అవి అన్నీ అమలు చేయకుండా బీసీలను చిన్న చూపు చూస్తోందన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా బీసీలు అందరు ఎకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ కి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చొలంగి వేణుగోపాల్, టిడిపి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, అధిక సంఖ్యలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జయహో బీసీ సమావేశం…
133
previous post