వికారాబాద్ జిల్లా తాండూరులో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ (Konda Visveswar Reddy) కి మద్దతుగా గోషామాల్ ఎమ్మెల్యే ప్రచారం చేశారు. చేవెళ్ల పార్లమెంటు కొండ విశ్వేశ్వర్ ని భారీ మెజార్టీతో గెలిపిద్దామని ప్రజలకు కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసంచేశారని తీవ్రస్థాయిలో రాజాసింగ్ మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి మోడీ ఆశీర్వాదం ఉందన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బిజెపికి ఓటు వేసి హిందువుల బలం చూపాలన్నారు. మోడీ భారతదేశం కోసం ఎంతో కష్టపడుతున్నారని మరోసారి మోడీ పీఎం కావడం ఖాయమన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాంగ్రెస్ పార్టీ వస్తే లవ్ జిహాద్ పెరుగుతుందని ఇప్పటికైనా అందరూ ఆలోచించి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఆశీర్వాదంతో తాండూరు నియోజకవర్గ సమస్యలపై పోరాడి అభివృద్ధి చేసుకుందామన్నారు. యువకులు బిజెపికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…