కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డ కేటీఆర్

ktr road show at manugodu

Advertisements

&NewLine;<p>తెలంగాణ శాసన సభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు&comma; అవాస్తవాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే&comma; మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు&period; ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని చెప్పారు&period; ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసన సభ చరిత్రలోనే విని ఉండమని అన్నారు&period; వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణాలన్నీచేసి కేవలం పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు&period; గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు&period; శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత తమకు ఉందని&comma; తప్పకుండా నిజాలను బయటపెడతామని కేటీఆర్ చెప్పారు&period; ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను ఆయన కోట్ చేశారు&period; ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరినీ మోసం చేయనని&comma; ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా ఇలాగే ఉందని&comma; గవర్నర్ ప్రసంగం కూడా అలాగే అనిపించిందని కేటీఆర్ ఆరోపించారు&period; అధికారంలో ఉన్నా లేకున్నా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని&comma; తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమేనని కేటీఆర్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..