మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి నిర్మించిన ‘లక్ష్మీ కటాక్షం (Lakshmi Kataksham)’ ట్రైలర్ విడుదల అయ్యింది. ఓపెనింగ్ లోనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ డేట్ నే సినిమాలో ఎలక్షన్ డేట్ లాగా అనౌన్స్ చేశారు, ప్రముఖ నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన పాతికేళ్ళ పొలిటికల్ కెరీర్ ను నిలబెట్టుకోవడం కోసం ఈ ఎలక్షన్ ను చాలా ప్రశ్టేజ్ గా తీసుకుంటాడు, మరో పక్క పోలీస్ ఆఫీసర్ ఎలాగైనా ఈ ఎలక్షన్ లో ఒక్క రూపాయి కూడా పంచకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ పోలీస్ బందోబస్త్ నుండి, తక్కువ టైంలో 100 కోట్లని, రెండు లక్షల మంది ఓటర్లకు, ఓటుకు 5000 చొప్పున ఎలా పంచుతారు అనే నేపధ్యంలో సినిమా కథ ఉండబోతున్నట్టు ట్రైలర్లో తెలుస్తుంది, ఈ ట్రైలర్ లో కామెడీ తో పాటు హూకింగ్ డ్రామా కూడా ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఒక పక్క సాయి కుమార్ కి ఎలక్షన్ ఫండ్ రావడం ఒక ఛాలెంజ్ అయితే, ఇంకో పక్క లాస్ట్ మినిట్ లో వచ్చిన ఫండ్ ఎలా పంచాలి అనేది ఇంకో ఛాలెంజ్, ఈ తరుణంలో చిరాకు పడి అన్ని దారులు మూసుకున్న సాయి కుమార్ లక్ష్మీ దేవిని ఎలక్షన్ ఫండ్ కటాక్షించమని డిమాండ్ చేస్తారు, లక్ష్మి దేవి ప్రత్యేక్షమవుతారు, ఇలాంటి విభిన్నమైన కథాంశాలతో సాగే ఈ ‘లక్ష్మీ కటాక్షం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సినిమాకి సూర్య రైటర్, డైరెక్టర్ గా వ్యవహరించారు. ట్రైలర్ లో డ్రామా పర్ఫెక్ట్ గా హైలైట్ అయ్యేలా మ్యూజిక్ అభిషేక్ రుఫుస్ అందించారు.
నటీ నటులు:
వినయ్
అరుణ్
దీప్తి వర్మ
చరిస్మా శ్రీకర్
హరి ప్రసాద్
సాయి కిరణ్ ఏడిద
ఆమనీ
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: మహతి ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి
రచన, డైరెక్టర్: సూర్య
మ్యూజిక్: అభిషేక్ రుఫుస్
డి ఓ పి: నని ఐనవెల్లి
ఎడిటర్: ప్రదీప్ జే
సౌండ్ డిజైన్: మురళీధర్ రాజు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్. రంగనాథ్ బాబు
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను , ధీరజ్- ప్రసాద్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్… భార్య స్నేహ రెడ్డి కి ధైర్యం చెప్పిన బన్నీఅల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమా పుష్ప 2. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న విడుదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ లో ఈ సినిమా చూడడానికి అల్లు అర్జున్ కూడా…
- నయనతార, ధనుష్ మధ్యలో మనస్పర్దలకి కారణం ఏంటి …?నటుడు ధనుష్ మద్రాస్ హైకోర్టులో నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులపై ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ వివాదంపై పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన మద్రాస్ హై కోర్ట్ జనవరి 8వ తేదీ లోపు ఈ వివాదం…
- అమరన్ శివకార్తికేయన్ తో జంటగా రష్మిక మందన్నావరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది రష్మిక మందన్నా…. పుష్ప 2లో తన నటనతో గ్లామర్, రొమాన్స్, నటన పరంగా తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో ఛావా,…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి