Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Latest News బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి…

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి…

by Prakash
Prakash Goud

ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (MLA Prakash Goud) :

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (MLA Prakash Goud) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రకాశ్ గౌడ్ కలిశారు. తన అనుచరులతో కలిసి ఈ రోజో, రేపో కాంగ్రెస్ లో చేరుతానని రేవంత్ కు ప్రకాశ్ గౌడ్ తెలిపారు. రేవంత్ సమక్షంలోనే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరోవైపు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో… ఆ పార్టీ శ్రేణుల్లో కలవరం నెలకొంది. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు యత్నిస్తున్నారు. అవసరమైతే కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని ఓ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.
    సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
  • హైడ్రా, రంగనాథ్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.
    హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. లోతుకుంట ప్రాంతంలోని భూవివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంలో హైకోర్టు ఈ కీలక హెచ్చరికలు జారీ చేసింది. లోతుకుంట పరిధిలోని…
  • నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పీడీఎస్‌యూ డిమాండ్.
    నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి…
Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: