తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడాలని, రైతులు బాగుండాలని కోరారు. దేవుడిని కూడ ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారని, హిందూ సంస్కృతి ఉన్న వారు దేశాన్నీ గౌరవిస్తారని, దేవుడిని సైతం కొందరు స్వంతం అని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతిర్లిలింగాలు, నాలుగు వేదాలు, నలుగురు జగద్గురు లు ఉన్న దేశంలో వాళ్ళ చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా, రాజకీయాల కోసం దేవుడిని ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పవిత్ర భారత దేశంలో రాజకీయాలను కూడ మార్కెటింగ్ చేస్తున్నారని, మేము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతిరేకమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందుత్వాన్ని విశ్వసించే వారు ఆలోచన చేయాలని, దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదని జగద్గురువులు చెబుతున్నారని, దేవుడు కొందరి వాడు కాదు అందరి వాడని, రాముడు, శివుడు, హన్మంతుడు మాకు లేడా అంటే మా పై రాజకీయం చేస్తున్నారన్నారు. దేశం లో మీ ప్రతిష్ట దిగజారుతున్న మీరు ఇంకా రాజకీయం చేస్తున్నారని, పార్లమెంట్ లో ఆదాని, అంబానీ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని విమర్శించారు. శివరాత్రి కంటే ముందు రాజన్న ఆలయ అభివృద్ధి పై వీటిడీ ఏ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఎవరు ప్రశ్నించక ముందే వేములవాడ ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
వేములవాడ రాజన్న సన్నిధి లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం…
83
previous post