పిఠాపురం వీరవాడ రోడ్ బ్రాహ్మణ అగ్రహారం వద్ద జరుగుతున్న లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమానికి నాగేంద్రబాబు (Nagababu) హాజరయ్యారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎన్నికైన వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం ఆధీనంలో ఉండడంతో హిందువుల సొమ్ములు వక్రమార్గం పడుతున్నాయన్నారు. వక్స్ బోర్డ్ గాని క్రిస్టియన్ మిషనరీలు గాని ప్రభుత్వం ఆధీనంలో లేవన్నారు. కేవలం హిందూ దేవుళ్ళ గుళ్ళు మాత్రమే ప్రభుత్వం పెత్తనం చెలాయించడం తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. 90 శాతం హిందువులకే గుళ్ళు, గోపురాల పై ఆజామాసి ఉండాలి, కేవలం 10 శాతం మాత్రమే ప్రభుత్వం దీని మీద అబ్జర్వేషన్ చేయాలన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్ ఉండి ఉంటే కచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చే వారురన్నారు. కూటమి పార్టీ జనసేన అధికారంలోకి రాగానే ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…