ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఏడు లక్షల కోట్ల అప్పులు చేశామని ఒకరంటే, 10 లక్షల కోట్లు అని ఇంకొకరు అంటున్నారనీ, వైసీపీ ప్రభుత్వం ఏకంగా 13 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు అంటున్నారని బుగ్గన చెబుతూ అసలు ఏ ప్రాతిపదికన ఇలా అంటున్నారని నిలదీశారు. కోవిడ్ సమయంలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైన విషయం నిజమేనని ఆయన అన్నారు. అయితే తెలుగుదేశం హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లలో చేసిన అప్పులు తక్కువేనన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014-2019 మధ్య కాలంలో అప్పులు 22 శాతం పెరిగితే, ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పెరిగిన అప్పులు 12 శాతం మాత్రమేనని మంత్రి వివరించారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 6 శాతంగా ఉందని, వైసీపీ ప్రభుత్వంలో 16.7 శాతంగా రెవెన్యూ రాబడి ఉందని తెలియజేశారు. 2018-19 చంద్రబాబు నాయుడి పాలనలో 5.3 శాతం నిరుద్యోగిత ఉందని, 2018-19లో 44 లక్షల 86 వేల పిఎఫ్ అకౌంట్లు ఉన్నాయన్నారు.
మీరు చేసిన అప్పుల కంటే మేము చేసిన అప్పులు తక్కువే…
87
previous post