ఏపీలోని విశాఖపట్నానికి బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ వెనుక బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeshwari) కుటుంబ సభ్యులే ఉన్నారని సీఎం వైఎస్ జగన్ (Jagan) సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో పట్టుకున్న డ్రగ్స్ వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, వ్యవస్థలు వెంటబడినా కూడా నా వెంట ప్రజలున్నారని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, ఇంటింట సంక్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం 2.70 లక్షల కోట్ల రూపాయాలను నేరుగా అందజేశామని పేర్కొన్నారు. ప్రజల ఏజెండానే లక్ష్యంగా వైసీపీ ఏ జెండాలతో కలవడం లేదని వెల్లడించారు.
ఇది చదవండి: ఏఈ భార్య ఇంట్లో కుప్పకూలి మృతి..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి