బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజయ్య…

Tatikonda Rajaiah

Advertisements

&NewLine;<p>తాజాగా బీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది&period; మాజీ డిప్యూటీ సీఎం&comma; మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ కు రాజీనామా చేశారు&period; గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు&period; మరో సారి కూడా ఆయన అక్కడి నుంచి టికెట్ ఆశించారు&period; కానీ బీఆర్ఎస్ రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు&period; మాజీ డిప్యూటీ సీఎం&comma; ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది&period; ఈ నిర్ణయంపై రాజయ్య మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా&period;&period; తరువాత పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేశారు&period;  కడియం శ్రీహరిని గెలిపించేందుకు నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు&period; బీఆర్ఎస్ మొదటి హయంలో డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్య సేవలు అందించారు&period; అయితే కొంత కాలం తరువాత ఆయన పదవిని కోల్పోయారు&period; ఇది అప్పట్లో రాజకీయంగా చర్చనీయాశం అయ్యింది&period; కానీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి&comma; సేవలు అందించారు&period; బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోవడం&comma; ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినప్పటికీ ఇప్పట్లో మరే పదవీ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు మొగ్గు చూపారు&period; వాస్తవానికి టికెట్ నిరాకరించినప్పటి నుంచే ఆయన బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు&period; ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దీప్ దాస్ మున్సి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలసి చర్చలు జరిపారని తెలుస్తోంది&period; దీంతో రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు&period; ఆ పార్టీకి రాజీనామా చేశారు&period; తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..