72
కొత్తపేట మండలం పలివెల గ్రామం చౌదరిపురం సత్తెమ్మ తల్లి గుడి వద్ద రోడ్డు పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం ఆచంటకు చెందిన ఆటో డ్రైవర్ బండి మోషే రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు కు చెందిన చీమల మాధవరావు మోటార్ సైకిల్ పై వస్తుండగా ఇరువురు ఎదురెదురుగా ఆటో, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చీమల నరసింహారావు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.