ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు…

Shri Lakshmi Narasimhaswamy Brahmotsavam

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు&period; బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టం స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది&period; రథోత్సవం పై లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగింపు కొనసాగింది&period; బాజాభజంత్రీలతో&comma; వేదపండితుల మంత్రోచ్ఛారణలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి నామస్మరణలతో రథోత్సవం ముందుకు సాగింది&period; ఆలయ ట్రస్టు చైర్మన్ రాజ ఆదిత్య లక్ష్మణ్ రావు&comma; మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; మంత్రి జూపల్లి కృష్ణారావు&comma; బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు రథోత్సవం ముందు భక్తులు మధ్య నడిచారు&period; స్వామివారి రథోత్సవం తిలకించడానికి లక్షలాది భక్తులు తరలివచ్చారు&period; ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో స్వామివారి రథోత్సవానికి తరలివచ్చారు&period; లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం నుండి లక్ష్మీదేవమ్మ గుట్ట శ్రమి వృక్షం దగ్గర రథోత్సవాన్నికి పూజలు నిర్వహించి ప్రధాన ఆలయం దగ్గరికి తిరిగి చేర్చారు&period; సాంప్రదాయ ప్రకారము చెంచులకు నరసింహ స్వామి అల్లుడు కావడంతో పూజలో చెంచులు&comma; మహిళలు పాల్గొన్నారు&period; రథోత్సవాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్