ఏఐటీయూసీతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని కార్మికులందరూ ఏఐటీయూసిని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులను కోరారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం ఏరియా వన్ జీడికే టు ఇంక్లైన్ పై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన యూనియన్లు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిన ఘనత ఏఐటియూసికే దక్కిందని అన్నారు. సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటు కోసం, ఉద్యోగాల కల్పన కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈసారి తమ యూనియన్ కి అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి. ఎల్లయ్య, బ్రాంచి అధ్యక్షులు రంగు శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారు – సీతారామయ్య
101
previous post