ఆపదలో సింగరేణి ఆసుపత్రి సంజీవని అంబులెన్స్

Sanjeevini Ambulance

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఉన్న సంజీవని ఐసియూ అంబులెన్స్ కు జబ్బు చేసింది&period; అత్యవసర వైద్య చికిత్సల కోసం మెరుగైన వైద్యం కోసం సింగరేణి కార్మికులను ఉద్యోగులను ఇతర ప్రాంతాల కార్పొరేట్ అసుపత్రులకు తరలించే అన్ని వసతులు ఉన్న సింగరేణి ఐసియూ అంబులెన్స్ సంజీవని కి జబ్బు చేసింది&period; మూడు నెలల క్రితం అంబులెన్స్ కు సాంకేతిక లోపాలు రావడంతో మూలకు పడేశారు&period; సింగరేణి ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు లాంటి కార్పోరేట్ ఆసుపత్రులకు తరలించే సమయంలో ఇదే అంబులెన్స్ లో పేషెంట్ కు పూర్తిస్థాయిలో అత్యవసర వైద్య సేవలు అందించే సౌకర్యాలు ఉండేవి&period; ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడే సకల సౌకర్యాలు ఉన్న ఈ సంజీవనికి మూడు నెలలు గడిచిన మరమ్మత్తులు చేయించాల్సిన సింగరేణి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు&period; సంజీవని మూలన పడడంతో ఎలాంటి సౌకర్యాలు లేని సాధారణ అద్దె అంబులెన్స్ లో పేషెంట్లను ఇతర కార్పోరేటు అసుపత్రిలకు తరలిస్తున్నారు&period; దీంతో మార్గం మద్యలో ప్రాణాలు పోయే అవకాశం ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు&period;<br>ఇప్పటికైనా సింగరేణి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వీడి ఐసియూ సేవలను అందించే సంజీవని అంబులెన్స్ కు రిపేరు చేయించి ప్రమాదాల బారిన పడిన కార్మికులు&comma; వారి కుటుంబ సభ్యులను మెరుగైన వైద్య సేవలకు ఇతర ప్రాంతాలకు సంజీవని అంబులెన్స్ ద్వారా తరలించి వారి ప్రాణాలను కాపాడాలని సింగరేణి కార్మికులు&comma; కార్మికసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్