కె ఎల్ మాట్ పరీక్ష (KL Mat exam):
హైదరాబాద్, విజయవాడ క్యాంపస్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో మొదటి విడతగా నిర్వహించిన కె ఎల్ మాట్ 2024 పరీక్ష ఫలితాలను పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బాచుపల్లి క్యాంపస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులను చదవటం ద్వారా అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. మెరుగైన విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పరిశోధన కేంద్రాలను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
హైదరాబాద్, విజయవాడ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించే తుది విడత ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను కూడా మంత్రి ఈ సందర్బంగా విడుదల చేశారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ప్రవేశ పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా, ఉద్యోగాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీతక్క పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రానిస్తున్నారని, వారి భద్రత, స్వయం శక్తి వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ వాళ్లు చేస్తున్న పనితీరు బాగోలేదని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకి ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారని అన్నారు పనులన్నీ పూర్తయ్యాయని పరువు ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.