వైభవంగా శ్రీవాణి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు…

Srivani's first anniversary celebrations in grand style...

Advertisements

&NewLine;<p>శ్రీసిటీ ఆధ్యాత్మిక&comma; సాహిత్య వేదిక &&num;8216&semi;శ్రీవాణి&&num;8217&semi; ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శనివారం శ్రీసిటీ లో ఘనంగా నిర్వహించారు&period; ఈ సందర్భంగా స్థానిక బిజినెస్ సెంటర్ లో నిర్వహించిన ప్రఖ్యాత కవయిత్రి&comma; తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రగాఢ భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి సాహిత్య స్వరాంజలి కార్యక్రమం సంగీత&comma; సాహిత్య ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ à°¡à°¾&period; సాయికృష్ణ యాచేంద్ర&comma; టీటీడీ శ్వేతా మాజీ డైరెక్టర్ భూమన్&comma; శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య భూమన కుసుమ కుమారి&comma; వెంగమాంబ రీసెర్చ్ స్కాలర్ గంధం శంకర్రావు ముఖ్య అతిధులుగా పాల్గొనగా&comma; శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జ్యోతి ప్రజ్వలన&comma; కుమారి మల్లాది అనూష ప్రార్ధనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ జీవిత విశేషాలు&comma; శ్రీవారిపై ఆమె సాహిత్యం&comma; విశిష్ట శైలి గురించి భూమన్&comma; భూమన కుసుమ కుమారి&comma; శంకర్రావు తమ ప్రసంగంలో వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రముఖ విద్వాంసులు&comma; స్వరకర్త&comma; గాయకులు&comma; శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ &lpar;SVBC&rpar; చైర్మన్&comma; వెంకటగిరి వెలుగోటి రాజకుటుంబ వారసుడు డాక్టర్ వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్ర చేసిన తరిగొండ వెంగమాంబ కీర్తనల స్వరకల్పనలో గాయకులు కొన్నింటిని రాగయుక్తంగా ఆలపించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°¡à°¾&period;కుసుమ కుమారి మాట్లాడుతూ &OpenCurlyQuote;వెంకటాద్రి మహిమ’ పురాణం నుంచి &OpenCurlyQuote;ద్వీపద భాగవతం’ వరకు ఆమె రచనలు సరళత&comma; స్పష్టత&comma; ప్రగాఢ భక్తితో ప్రతిధ్వనిస్తాయన్నారు&period; శ్రీవేంకటేశ్వరునిపై ఆమెకున్న అమోఘమైన విశ్వాసం &&num;8216&semi;ముత్యాల హారతి&&num;8217&semi;లో వ్యక్తమైందని&comma; ఇది నేటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచరిస్తున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తిరుమలలో ఆచరిస్తున్న ఈ రోజువారీ సేవ&comma; వెంగమాంబ ఆధ్యాత్మిక వారసత్వానికి శాశ్వత నివాళిగా ఆమె పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వెంగమాంబ రచనలకపై à°¡à°¾&period; యాచేంద్ర స్వరకల్పన చేసిన &&num;8216&semi;ఆడినే శివుడాడీనే&&num;8217&semi;&comma; &&num;8216&semi;ఏమి తపము చేసివమ్మా&&num;8217&semi;&comma; &&num;8216&semi;ఆడెనే బాలకృష్ణుడు ఆడెనే&&num;8217&semi;&comma; &&num;8216&semi;బ్రహ్మదేవుడొచ్చెను&&num;8217&semi;&comma; మరికొన్ని పాటలను యువ గాయకులు మల్లాది అనూష&comma; పవిత్ర&comma; à°¶à°¿à°µ శ్రవణ్&comma; నరేష్ కూడా కొన్ని పాటలను ఆలపించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వీరికి వాయిద్య కళాకారులు బాబు &lpar;కీబోర్డు&rpar;&comma; వెంకట్రావు &lpar;తబలా&rpar;&comma; నటరాజ్ &lpar;ఫ్లూట్&rpar;&comma; చిల్లర సుబ్రమణ్యం &lpar;తాళం&rpar;&comma; శంకర్రావు &lpar;వ్యాఖ్యాత&rpar; అద్భుతమైన సహకారాన్ని అందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి&comma; శ్రీవాణి ప్రథమ వార్షికోత్సవానికి వచ్చిన అతిథులందరికీ సాదరంగా స్వాగతం పలికి&comma; శ్రీవాణి ద్వారా ఏడాదిగా నిర్వహిస్తున్న వివిధ భక్తిమయ&comma; సంగీత&comma; సాహిత్య ప్రదర్శనలు మరియు సంగీత సాహిత్య ప్రియులను అవి ఎలా ఆకట్టుకుందో వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వెంగమాంబ స్వరాంజలి కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ యాచేంద్ర&comma; భూమన్&comma; à°¡à°¾&period; కుసుమ కుమారి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ&comma; గతంలో అన్నమయ్య సంకీర్తనావళి తరహాలో ఈ కార్యక్రమం కూడా శ్రీవాణి ద్వారా శ్రీసిటీయేతర ప్రాంతాలకు విస్తరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాగా&comma; తరిగొండ వెంగమాంబ &lpar;1730-1817&rpar; తన జీవితాన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం చేసింది&period; ఆమె ఔత్సాహిక కవులకు స్ఫూర్తిదాయకంగా&comma; భక్తులలో నమ్మకం&comma; విశ్వాసం నింపే మార్గదర్శిగా మిగిలింది&period; ఆమె జీవితం మరియు రచనలలోని గొప్పదనం భగవంతుడు&comma; మానవాడు మధ్య కళల యొక్క సామర్థ్యాన్ని ఒక వంతెనలా మనకు గుర్తు చేస్తాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వెంగమాంబ మనోహరమైన భక్తిమయ రచనలు&comma; చిరస్థాయిగా కొలువుండేలా భక్తుల హృదయాలలో ఆమె సుస్థిరస్థానం పొందింది&period; ఈమె రచనలలో యక్ష గానాలు&comma; ఆధ్యాత్మిక గేయాలు&comma; పద్యకృతులు&comma; పద్యకావ్యాలు&comma; ద్విపదకావ్యాలు&comma; తాత్విక కావ్యాలు వంటి వివిధ సాహితీ ప్రక్రియలు దర్శనమిస్తాయి&period; తాత్విక కావ్యాలలో రాజయోగామృతసారం గొప్ప పేరు పొందింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీసిటీ పీఆర్‌వో పల్లేటి బాలాజీ పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమంలో శ్రీసిటీ పరిసర ప్రాంతాలతో పాటు శ్రీహరికోట&comma; చెన్నై&comma; నెల్లూరు&comma; సూళూరుపేట ప్రాంతాలకు చెందిన పలువురు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..