తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి. నాగయ్య (T. Nagayya) అర్ధరాత్రి 2 గంటలకు గుండెపోటుతో తన స్వగ్రామమైన బెల్లంపల్లి లో మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాగయ్య కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో సీనియర్ నాయకులుగా, మేధావిగా గుర్తింపు పొందారు. టి. నాగయ్య మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నాగయ్య లాంటి విద్యావంతులు, మేధావి, ఉద్యమ కారుడి అకాల మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి తన జీవితకాలం పార్టీ విస్తృతం చేసేందుకు కృషి చేసిన నాయకులు నాగయ్య అని ఆయన అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి