Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News తైవాన్ తీవ్ర భూకంపంతో వణికిపోతున్న ప్రజలు..

తైవాన్ తీవ్ర భూకంపంతో వణికిపోతున్న ప్రజలు..

by Satya
People are shaking after the severe earthquake in Taiwan

తూర్పు ఆసియా దేశం(Asian Country) తైవాన్(Taiwan) తీవ్ర భూకంపాల(Earthquakes)తో వణికిపోతోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల(24 hours) వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు సంభవించాయి. తైవాన్ తూర్పు తీరంలో అత్యధిక తీవ్రత 6.3గా నమోదయింది. ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది.

ఇది చదవండి: MI vs CSK IPL Match 2024 | ముంబై గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం..

దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్‌లో ఎక్కువ భూకంపాల కేంద్రాలను గుర్తించినట్టు వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా ఏప్రిల్ 3న తైవాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 14 మంది మరణించారు. ఆ నాటి నుంచి తైవాన్ వరుస భూప్రకంపనలు చవిచూస్తోంది. భూకంపాలకు అధిక అవకాశం ఉండే రెండు ‘టెక్టోనిక్ ప్లేట్స్’ జంక్షన్‌కు సమీపంలో తైవాన్ ఉంటుంది. అందుకే ఆ దేశం ఎక్కువగా భూకంపాలకు గురవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

019160
Total views : 90038

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.