అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె రాబోయే 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యం అంటున్న జయచంద్ర రెడ్డి. పి.టీ.ఎం మండలం లో ఎలక్షన్ల హడావిడి నెలకొంది ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తరఫున ముందున్న జయ చంద్రారెడ్డి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యం అంటున్న జయచంద్రారెడ్డి. నియోజకవర్గంలోని పెద్దతిప్ప సముద్రం మండలంలోని పలు గ్రామాలలో విస్తృత పర్యటన చేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసిరిపల్లి జయచంద్ర రెడ్డి మండలంలోని టీ.సదుం పంచాయతీ పాపాగ్ని నది ఒడ్డున వెలసిన సంగమేశ్వర స్వామి ఆలయంలో , చెన్నారాయనపల్లి వద్ద ఉన్న చౌడేశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం టి.సదుం పంచాయతీ నవాబు కోట,బెట్టకొండ, గ్రామాల్లో పర్యటించి ఎన్నికల పరిచయ కార్యక్రమాల్లో ముందున్న జయచంద్ర రెడ్డి. అనంతరం జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వంతోనే సుసాధ్యతమని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్ అండ్ బి రోడ్లను వేయకుండా గతంలో నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్లను వేసి మేమే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదమని తెలిపిన జయచంద్ర రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడారును ఏర్పాటు చేసి యువతకు ఉపాధి చేకూర్చాలని తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న జయ చంద్రారెడ్డి.
తంబళ్లపల్లెలో జోరు అందుకుంటున్న టీడీపీ…
109
previous post