133
హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరికి ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నాయకులు, ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, మంతెన సత్యనారాయణ రాజు, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గద్ధె అనురాధ స్వాగతం పలికారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి పర్యటనకు నారా భువనేశ్వరి వచ్చారు. చెరుకుపల్లి గ్రామంలో కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.