అమెరికాలో ముగ్గురు ఏపీ కిరాతకాలు

Three AP Kiratakas in America

Advertisements

&NewLine;<p>అగ్రరాజ్యం అమెరికాలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చేసిన కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి&period; 20 ఏళ్ల విద్యార్థిని బంధించి&comma; తీవ్రంగా హింసిస్తూ వీరు రాక్షసానందం పొందారు&period; దాదాపు 7 నెలల పాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది&period; మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది&period;<br>20 ఏళ్ల బాధిత యువకుడిపై సత్తారు వెంకటేశ్ రెడ్డి&comma; నిఖిల్&comma; శ్రవణ్ లు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు&period; ఓ రెస్టారెంట్ లో బాధిత యువకుడు మరో వ్యక్తికి ఎంతో బాధగా కనిపించాడు&period; దీంతో&comma; ఆ వ్యక్తి బాధిత యువకుడిని కలిసి ఏదైనా సమస్య ఉంటే తనకు ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు&period; దీంతో&comma; ఈ ముగ్గురు తనను టార్చర్ చేస్తున్న విధానాన్ని వాట్సాప్ ద్వారా అతనికి తెలియజేశాడు&period; ఈ దారుణం గురించి తెలుసుకున్న ఆయన చలించిపోయి పోలీసులకు సమాచారం అందించాడు&period; వెంటనే ఆ ముగ్గురు ఉంటున్న నివాసానికి పోలీసులు వెళ్లారు&period; అయితే పోలీసులు లోపలకు వచ్చేందుకు ఆ ముగ్గురు నిరాకరించారు&period; పోలీసులు వచ్చిన విషయాన్ని గ్రహించిన బాధితుడు వెంటనే వారి వద్దకు వచ్చి తన బాధలను చెప్పుకున్నాడు&period; తనను రక్షించాలని కోరాడు&period; అనంతరం ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు&period; మానవ అక్రమ రవాణా&comma; హింసించడం తదితర సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్